ప్రముఖ సంస్థల సిఇఓలతో చంద్రబాబు భేటీ
posted on Nov 13, 2014 3:50PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ సంస్థల సిఇఓలతో భేటీ అయ్యారు. భారత ప్రధాని నరేంద్రమోడీ మేక్ ఇన్ ఇండియా అని పిలుపు ఇచ్చారని, తాను ఇస్తున్న మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఏపీ పిలుపుకు స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన సిఇఓలను కోరారు. ఈ సమావేశంలో ఎన్ సెండాన్, సెమెబ్ కార్బ్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్స్, జురాంగ్ ఇంటర్నేషనల్, సుర్బానా, మీన్ హార్ట్ తదితర సంస్థల సిఇఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలకు సంబంధించిన వీడియోను వారికి చూపించారు. అలాగే టాటా ఫియా, సెమెబ్ కార్బ్ తదితర విమానయాన సంస్థల ప్రతినిధులతోనూ సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ సర్వీసుల నిర్వహణకు గల అవకాశాలను వారికి వివరించారు.