తెలుగుదేశం శాసనసభ్యులు అరెస్టయ్యారు
posted on Nov 13, 2014 3:32PM

అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా వీరు గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టగా పోలీసులు వీరిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకుముందు శాసనసభలో తెలంగాణ శాసనసభ నుంచి తెలుగుదేశం సభ్యులను వారం రోజులపాటు సస్పెండ్ చేశారు. తెలుగుదేశం సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేస్తూ మంత్రి హరీష్ రావు వారిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దాంతో టీడీపీ సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి వారం రోజులపాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. తెలుగుదేశం సభ్యులు ఎర్రబెల్లి దయాకర్, రేవంత్ రెడ్డి, ఆరికెపూడి గాంధీ, గోపీనాథ్, వివేకానంద, కిషన్ రెడ్డి, వెంకట వీరయ్య, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, సాయన్న సస్పెండ్ అయిన వారిలో వున్నారు.