చంద్రబాబు.. కేసీఆర్.. ఢీ అంటే ఢీ

నోటుకు ఓటు కేసులో ఇరు రాష్ట్రాల నేతలు ఎవరి వ్యూహాలతో వాళ్లు ముందుకెళుతున్నారు. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పంతం నెగ్గించుకోవాలని, ఎలాగైనా చంద్రబాబును ఈ కేసులో ఇరికించాలని చూస్తుంటే మరోవైపు ఏపీ ప్రభుత్వం తమపై ఉన్న ఆరోపణలను ఎలాగైనా చేధించాలనే కసితో ఉంది. ఈ కేసు ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలకు ఒక సవాల్ గా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ అధికారులు తలమునకలై ఉన్నారు. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఆడియో, వీడియో రికార్డింగులను, వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా దానికి సంబంధించిన నివేదిక రానుంది. మరోవైపు ఏసీబీ అధికారులు ఈ కేసులో అత్యంత కీలక సమాచారం స్టీఫెన్ సన్ వాంగ్మూలం తీసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యారు.

 

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం తమ పనిలో తాము ఉండగా చంద్రబాబు ఏలాగైనా వారిని ఎదుర్కోవాలనే పనిలో పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిగ్గు తేల్చాలని స్పెషల్ ఇన్వేస్టిగేటింగ్ టీమ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్‌ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనూరాధతో కలిసి సమావేశమయి సిట్ ను ఏర్పాటు చేయనున్నారు. అసలే ఈ వ్యవహారంపై లీగల్ యాక్షన్ తీసుకుందామని సమాలోచనలో ఉన్న చంద్రబాబు ఈ కేసులో ఉన్న లొసుగులు దానికి సంబంధించి పలు అంశాలపై పోలీసు అధికారులను అడిగి తెలుకొని దానిని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

మొత్తానికి ఓటుకు నోటు కేసులో తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. కేసీఆర్ వేసే ఎత్తుగడలను ఎలా తిప్పి కొట్టాలో చంద్రబాబు ప్రయత్నాలలో చంద్రబాబు ఉన్నారు. ఆఖరికి ఈ పోరులో ఎవరు గెలుస్తారో!...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu