నలంద కిషోర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
posted on Jul 25, 2020 2:42PM
నలంద కిషోర్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నానన్న చంద్రబాబు.. వైసీపీ తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో మృతి చెందడం బాధాకరం అన్నారు
సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడనే వంకతో నలంద కిషోర్ పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వృద్దాప్యంలో ఆయనను అరెస్ట్ చేసి, కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ నుంచి రోడ్డుమార్గంలో అనేక జిల్లాలు దాటించి కర్నూలు తరలించడం హేయమైన చర్య అన్నారు.
పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి, నానారకాలుగా శారీరక, మానసిక హింస పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నలంద కిషోర్ మరణానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.