నదులను కలపాలి
posted on Nov 21, 2014 12:51PM

నదుల అనుసంధానం అనే అంశం మీద న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘జల మంథన్’ సదస్సులో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు న్యూఢిల్లీకి వెళ్ళారు. ఆ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘నదుల అనుసంధానం అంశం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం అవసరం. కొన్ని దేశాలు సముద్రపు నీటిని మంచినీరుగా మార్చుకుంటున్నాయి. జలవనరులు చాలా ముఖ్యమైనవి. వాటిని కాపాడుకుంటూనే మైక్రో ఇరిగేషన్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితిలో నీటి నిర్వహణ మరింత జాగ్రత్తగా వుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో వున్న గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పలువురు ఉన్నతాధికారులు, పలువురు నీటి పారుదల రంగ నిపుణులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల మంత్రి ఉమాభారతి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభును కూడా కలిశారు.