ధనిక దంపతులను చంపేశారు...

 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ మహంకాళి లక్ష్మణరావు, ఆయన భార్య తులసిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి వారి ఇంట్లోనే దారుణంగా గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మహంకాళి లక్ష్మణరావు ఫైనాన్షియర్ కావడంతో వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు వుంటుందని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళిద్దర్నీ చంపి వుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అయితే వీరి గురించి తెలిసిన కొంతమంది మాత్రం పాత కక్షల కారణంగానే ఈ హత్యలు జరిగి వుండొచ్చని  అంటున్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఫైనాన్షియర్లు హత్యకు గురికావడం మామూలైపోయింది. ఇటీవలికాలంలోనే ఈ ఊళ్ళోనే ముగ్గురు ఫైనాన్స్ వ్యాపారులు హత్యకు గురయ్యారు. ఇప్పుడు లక్ష్మణరావు హత్యతో మిగతా ఫైనాన్స్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu