టీడీపీ సారథిగా మళ్లీ చంద్రబాబు ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న మహానాడులో చివరిరోజు నిర్వహించిన ఎన్నికల్లో చంద్రబాబును వరుసగా రెండోసారి పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ ఎన్నికల కన్వీనర్ పెద్దిరెడ్డి ప్రకటించారు. అనంతరం కార్యకర్తల హర్షధ్వానాల మధ్య జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి అభ్యున్నతికి, సుసంపన్నమైన రాష్ట్ర స్థాపనకు కృషి చేస్తానని సీఎం ప్రతిజ్ఞ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu