రెండు రోజుల్లో చెబుతా.. విజయరామరావు
posted on Dec 12, 2015 4:17PM

టీడీపీ మాజీ మంత్రి విజయరామారావు నిన్న టీడీపీ కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఫ్యాక్స్ ద్వారా విజయరామారావు తన రాజీనామా పత్రాన్ని టీడీపీ నేతలకు అందజేశారు. అయితే ఇప్పుడు విజయరామారావు పార్టీ మారుతారా లేదా అన్నదానిపై సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి విజయరామారావు మాట్లాడుతూ.. నిన్ననే టీడీపీకి రాజీనామాచేశాను.. టీఆర్ఎస్ లో చేరమని నన్ను ఆహ్వానించారని.. టీఆర్ఎస్ లో చేరేది లేనిది రెండు రోజుల్లో చెబుతానని చెప్పారు. అయితే మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు విజయరామారావుకి ఫోన్ చేశారని.. పార్టీ మార్పుపై ఆలోచించుకోవాలని చెప్పినట్టు దీంతో విజయరామారావు సందిగ్ధంలో పడినట్టు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రెండు రోజుల తరువాత విజయరామారావు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.