నా భార్యనే నన్ను కామెంట్ చేస్తుంది.. వెంకయ్య
posted on Dec 12, 2015 3:47PM

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పంచ్ డైలాగ్లు వేయడంలో దిట్ట. ప్రతిపక్షాలపై.. విమర్శలు చేయాలన్నా.. వాళ్లపై పంచ్ డైలాగ్స్ వేయాలన్నా ఆయనకు ఆయనే సాటి. అలాంటి ఆయనపై ఆమె భార్యనే పంచ్ డైలాగ్స్ వేసిందట. సాదారణంగా రాజకీయ నాయకులకు కుటుంబసభులతో కలిసి గడిపే సమయం ఉండదు.. ఇక కేంద్రమంత్రులకైతే చెప్పక్కర్లేదు.. అందునా నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న రాజకీయ ఉద్దండుడు వెంకయ్య.. మరి అలాంటి వెంకయ్యకు ఇంటికి వెళ్లే తీరిక ఉంటుందా.. ఎప్పుడో ఒకసారి కాని వెళ్లే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే వెంకయ్యపై ఆమె భార్య పంచ్ డైలాగ్ వేసిందట. ఈ విషయాన్ని స్వయంగా వెంకయ్యనే తెలిపారు.
నరసారావుపేటలో జరుగుతున్న మున్సిపాలిటీ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కన్నతల్లిని మాతృభాషను, జన్మనిచ్చిన ఊరును మరచినవాడు మనిషే కాదని తాను నమ్ముతానని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కానీ రాజకీయ నాయకుడిగా ఉన్న కారణంగా దేశం మొత్తం తిరగాల్సి ఉంటుంది.. అందుకే ఇంటికి కూడా సరిగా వెళ్లలేని పరిస్థితి.. నా భార్య కూడా `అప్పడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారని అంటుంటుంద`ని చెప్పారు.