రాక్షస పాలనకు రాష్ట్రపతి  పాలనే విరుగుడు! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతోంది? అని ఎవరిని అడిగినా అరాచక,  రాక్షస  పాలన సాగుతోందనే  సమాధానమే వస్తుంది. ప్రజాస్వామ్యం ముసుగులో నియంత పాలన సాగుతోందనే జవాబే  వస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రావణుడు మళ్ళీ పుట్టి ఏపీని ఏలుతున్నాడన్న సమధానమే వస్తుంది. అయితే   అదేదో ఇప్పుడు మొదలైంది కాదు, ఇప్పుడు పుట్టింది కాదు. ఇప్పుడు పరాకాష్టకు చేరింది. అందుకే, ఈ బరితెగింపు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్ళపై దాడి. వినాశకాలే విపరీత బుద్ధి.

నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే అరాచక పాలన మొదలైంది. తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కక్ష కట్టి దాదులు చేయడంతో మొదలైన అరాచక పాలన ఇప్పుడు ... ఏకంగా పార్టీ కార్యాలయం, నాయకుల ఇళ్ళపై దాడులు చేసే దుర్మార్గ దురహంకార దుస్థితికి చేరుకుంది.అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎంతమంది టీడీపీ  కార్యకర్తల ఉసురు పోసుకున్నారో, వైసీపీ గూండాలు ఎంత కిరతకంగా వ్యవహరించారో, తెలియంది కాదు. ఇప్పుడు, మళ్ళీ కార్యకర్తల ముసుగేసుకున్న వైసీపీ గూండాలు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. ఇతర జిల్లాల్లోనూ పార్టీ కర్యాలయాల పైన, టీడీపీ నాయకుల ఇళ్ళపైనా యధేచ్చగా విరుచుకుపడ్డారు. 

వైసీపీ గూడాలు దాడులు చేస్తుంటే  మరో వంక పోలేసులు నేతల ఇళ్ళలోకి చొరబడి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. విజయవాడలో గతంలో రెండుసార్లు  ఎటాక్ చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి   పట్టాభి  ఇంటిపై మళ్ళీ మరో మారు దాడి చేశారు,ఈసారి ఇంట్లోకి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డారు.వైసీపీ గూండాలు ఇట్లోకి వెళ్లి దాడిచేస్తే, పోలీసులు ఇంటి గేటు విరగొట్టి మరీ పట్టాభి ఇంట్లోకి ప్రవేశించి, అరెస్ట్ చేశారు. యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా ఈ స్థాయిలో ద్దులు, దౌర్జన్యాలు జరూతున్నాయంటే, ఇదొక పథకం ప్రకారం జరుగతున్న దాడులు మాత్రమే కాదు. ముఖ్యమంత్రి, ప్రభుత్వం, పోలీసుల అండదండలతో జరిగిన, జరుగుతున్న దాడులుగానే చూడవలసి ఉంటుంది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇది ఖచ్చితంగా సర్కార్ సాగించిన అరాచకం. 

ఇంకా సిగ్గులేనితనం ఏమంటే, ముఖ్యమంత్రి మొదలు వైసీపీ నాయకులు అందరూ, టీడీపీ ప్రతినిధి, కొమ్మారెడ్డి  పట్టాభి ముఖ్యమంత్రిని అనరాని మాటలు అన్నారని, అందుకే ఆగ్రహానికి గురైన కార్యకర్తలు దాడులు చేశారని సమర్ధించుకుంటున్నారు. ఎంత సిగ్గులేని తనం? ఇలాంటి అరాచక ఆలోచనాధోరణి ఉన్న వారు, అధికారంలో కొనసాగడానికి అర్హులేనా? ప్రజాస్వామ్యానికి ఇంతకు మించిన అవమానం ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది. అంతే కాదు పెద్దల అండదండలు లేకుండా, తెలుగు దేశం పార్టీ ప్రధాన  కార్యాలయంపై దాడిచేసే సాహసం ఎవరూ చేయరు. కార్యాలయ సిబ్బంది తలలు పగగోట్టే సాహసం చేయరు.  ముఖ్యమంత్రి, డీజీపీ సహకారం ప్రోద్బలం ఉన్నాయి కాబట్టే, డీజీపీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే, అరాచక శక్తులు, వైసీపీ గూడాలు రెచ్చిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


నిజానికి జగన్ రెడ్డి చరిత్రను తిరగేస్తే, ఆయన మీద ఆర్థిక నేరాలకు సంబంధించిన  కేసులు మాత్రమే కాదు, పరిటాల రవి మర్డర్ కేసు మొదలు ఇతర కేసులున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకాననంద రెడ్డి మర్డర్ కేసులోనూ పలు అనునాలున్నాయి. అందులో జగన్ రెడ్డి హస్తం ఉందనే అనుమానం కూడా ఒకటి. ఆయన హస్తం ఉంది కాబట్టే సీబీఐ విచారణ నత్తనడకన సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఖాతాలో  ఇంకా ఎన్ని నేరాలు .. ఘోరాలు ఉన్నాయో ఏమో కానీ, అవన్నీ ఒకెత్తు అయితే.. గత రెండున్నర సంవత్సరాలుగా సాగుతున్న  పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి అయినా ఆయనలో ఇంకా పాతవాసనలు పోలేదనే విమర్శలు వస్తున్నాయి. అధికార దాహంతో ఫ్యాక్షనిస్ట్’ బ్లడ్ బుసలు కొడుతున్న వైనమే కనిపిస్తోందని, ఆయన  అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. 

అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్’ను మాసికంగా వేధించి, ఆత్మహత్య చేసుకునేలా చేసిన తీరుగానే, తెలుగు దేశం కీలక నేతలను రాజకీయంగానే కాకుండా భౌతికంగా అడ్డుతొలిగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అవసరం అయితే భౌతిక దాడులకు కూడా సిద్ధమయ్యే ప్రమాదం ఉందని  ఇంటెల్జెన్సీవర్గాల సమాచారంగా  వినవస్తోంది. ఈమేరకు కొందరు నేతలకు హెచ్చరికలు అందినట్లు సమాచారం. నిజానికి అధికారం కోసం ఎంతకైనా తెగించే, ‘మూర్ఘత్వం’ ఆయన రక్తంలోనే ఉందని,  సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు అంటారు. అందుకు ఆధారంగా  వైఎస్ గతాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో  వైఎస్ ఆయన్ని గద్దేదించేందుకు హైదరాబాద్’లో  మతకలహాలు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అమాయకుల మరణానికి కారణమయ్యారని అంటారు. ఆ అన్నది కూడా ఎవరో కాదు, అప్పటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి శాసన సభలోనే ఆరోపించారని సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేస్తారు.  ఈ నేపధ్యంలో ఇప్పుడు జరుగతున్న పరిణామాలను గమనిస్తే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైఎస్ అడుగు జాడల్లో  అధికారం  నిలుపుకునేందుకు అరాచకానికి కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయనే చర్చ జరుగుతోంది. 

అందుకే ఇప్పుడు జరుగతున్నదాడులను, ఇక్కడికే పరిమితం చేసి చూడరాదని, ఒక భయంకర కుట్రలో భాగంగా జరుగుతున్న దాడులుగానే చూడాలని, ఆ రీతిలోనే జవాబు ఉండాలని అంటున్నారు. 
నిజానికి, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసిన విధంగా, రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలనవిధించడమే జగన్ రెడ్డి అరాచక, నియంత పాలనకు సరైన సమాధానం అంటున్నారు. ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం  చేస్తున్న నీచ, నికృష్ట పాలనకు  ఆర్టికల్ 356 ఒక్కటే సరైన సమాధానం అవుతుందని, రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు న్యాయనిపుణులు కూడా అంటున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 356 పొందు పరిచిందే ఇలాంటి ప్రజాస్వామ్య హంతకుల నుంచి ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే అంటున్నారు, రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు. బంతి ఇప్పడు కేంద్రం కోర్టులో ఉంది ... కేంద్రం సరైన చర్యలు తీసుకుంటుందా ... లేక ... రహస్య ‘మిత్ర’ ధర్మాన్ని పాటించి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తుందా చూడవలసి వుంది..