చందన బ్రదర్స్ షాపులో భారీ చోరీ

 

హైదరాబాద్ లోని కూకట్ పల్లి వద్దగల చందనాబ్రదర్స్ జ్యువలరీస్‌ షాపులో ఈరోజు ఉదయం దాదాపు అరకేజీ బంగారం, పది లక్షల నగదు దొంగతనం జరిగింది. షాపు నిండా అనేక సీసీ కెమెరాలు, అనేకమంది సెక్యురిటీ సిబ్బంది ఉన్నప్పటికీ దొంగతనం జరిగినట్లు ఎవరూ పసిగట్టలేక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దొంగతనం జరిగినట్లు గుర్తించగానే షాపు మేనేజరు స్స్థానిక పోలీసు స్టేషనులో పిర్యాదు చేయగానే పోలీసులు, క్లూస్ టీం బృందం అక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీ టీవీల ఫుటేజి ఆధారంగా త్వరలోనే దొంగలను పట్టుకోగాలమని పోలీసులు చెపుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu