చక్రి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడా?

 

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఆయన ఆర్థిక విషయాలు బయటకి వస్తున్నాయి. చక్రి భార్య శ్రావణి చక్రికి విషం పెట్టి చంపిందని చక్రి తల్లిదండ్రలు, సోదరీమణులు ఆరోపిస్తుంటే, చక్రి భార్య వారంతా ఆస్తికోసం తనను వేధిస్తూ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ గొడవ బయట పడిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. భారీ పర్సనాలిటీతో, ఒంటి నిండా నగలతో టాలీవుడ్ బప్పీలహిరిగా అందరూ పిలిచిన చక్రి ఈమధ్యకాలంలో తీవ్రంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారని తెలిసింది. ఇటీవలి కాలంలో చక్రికి సంగీత దర్శకుడిగా చిత్రాలు బాగా తగ్గిపోవడంతో ఆయన ఆర్థికంగా బాగా ఇబ్బందులకు గురయ్యారని సమాచారం అందుతోంది. ఏవో కొన్ని స్థిరాస్తులు తప్ప ఆయన దగ్గర చెప్పుకోదగిన విధంగా డబ్బు లేదని తెలుస్తోంది. బయటి ప్రపంచం భావించేదాని ప్రకారం దాదాపు వంద సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి కోట్లకు పడగలెత్తి వుండాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu