ధనశ్రీ తో విడాకుల వార్తలపై చాహల్ పోస్టు
posted on Mar 1, 2025 11:35AM
భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ , ధనశ్రీ వర్మ మధ్య విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి 2020లో వివాహమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ అనే పదాన్ని తొలగించడం తో విడాకుల వార్తలు గుప్పుమన్నాయి. బాంద్రా కోర్టుకు భార్యభర్తలు హాజరయ్యారని కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఈ జంట కలవడం లేదని వార్తలు రావడంతో చాహల్ ఇన్ స్టా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘ నియంత్రించలేనంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దయతో ఉండటమే అన్నింటికంటే మంచి పని’’ అని రాసుకొచ్చాడు. వీరి విడాకుల కేసు బాంద్రా కోర్టులో తుది దశకు చేరుకుంది.