అమరావతి సెల్ఫ్ సస్టెయినింగ్.. అందుకే నిధుల కేటాయింపు లేదు!
posted on Mar 1, 2025 11:26AM

రాజధాని అమరావతిని సెల్ఫ్ సస్టెయినింగ్ ప్రాజెక్ట్ గా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అభివర్ణించారు. అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆయన ఆ బడ్జెట్ ప్రసంగంలో అమరావతిని సెల్ఫ్ సస్టెయినింగ్ ప్రాజెక్టుగా బలంగా చెప్పారు. ఆ కారణంగానే బడ్జెట్ లో అమరావతికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చెప్పడమే కాకుండా.. త్వరలో అమరావతి పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అమరావతి పనులు జోరందుకున్నాయి. జంగిల్ క్లియరెన్స్ పూర్తయ్యింది. రాష్ట్ర అభివృద్ధికి అమరావతే గ్రోత్ ఇంజిన్ అని పలు సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు,ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో వంటి ఆర్ధిక సంస్థలు నిధులు ఇచ్చాయి. ఆ నిధులతో రాజధాని అమరావతి తాను స్వయంగా అభివృద్ధి చెందడమే కాకుండా రాష్ట అభివృద్ధికి కూడా దోహదప డుతుంది. రాష్ట్రప్రభుత్వం తన ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టును సెల్ఫ్ సస్టెయిన్ డా ప్రకటించి, బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం అన్నది నిజంగా సాహసోపేతం. గతంలో ఎన్నడూ ఎవరూ చేయని సాహసం. ప్రభుత్వం నిధులు కేటాయించే అవసరం లేకుండానే.. పనుల ప్రారంభించనునన్నట్లు ప్రకటించడం లోనే ప్రభుత్వం ఎంత పకడ్బందీగా అమరావతిని పరుగులెత్తించడానికి ప్రణాళికలు రచించిందన్నది అవగతం చేసుకోవచ్చును.