తిరుమలపై కేంద్ర హోం శాఖ నజర్

ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, అలాగే 13న లడ్డూ విక్రయ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటలపై టీటీడీని వివరణ కోరింది.

అలాగే ఈ ఘటనల వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సజీవ్ కుమార్ జిందాల్  ఆది, సోమ వారాల్లో (జనవరి 19, 20)  తిరుమలలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన టీటీడీ అధికారులతో భేటీ అవుతారు. తరువాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారు.   టీటీడీ పాలకమండలి పాలకమండలి వ్యవహారాల్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. చరిత్రలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu