సింగపూర్ లో వరుస భేటీలతో బాబుబిజీబిజీ
posted on Jul 28, 2025 9:48AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు సోమవారం (జులై 28) పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిథులతో వరుస భేటీలతో బీజీబిజీగా సాగనుంది. ట్రెజరీ భవనంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్సీలెంగ్ తోచంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పరిష్కారంపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
అలాగే ఈ రోజు భేటీలలో పలు కంపెనీల ప్రతినిథులకు చంద్రబాబు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు పోర్టులు తదితర రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిం చనున్నారు. లాజిస్టిక్ రంగంలో బలంగా ఉన్న సింగపూర్ నుంచి ఏపీలో పోర్టుల నిర్మాణం విషయంలో సహకారం ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆశక్తి కనబరిచిన సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్, గృహ నిర్మాణంలోనూ ఏపీతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు.