కాళేశ్వరంపై సీబీఐ విచారణ షురూ
posted on Sep 25, 2025 12:59PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలుపెట్టింది. ఎన్డీఎస్ఏ, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ప్రాజెక్ట్ జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారించనుంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యాక ఎఫ్ఎఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకల విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం అసెంబ్లీలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు ముందుకు వచ్చింది. కాళేశ్వరంపై గురువారం (సెప్టెంబర్ 25) నుంచి సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, అవినీతిపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ నివేదికలను సీబీఐ పధికారులు పరిశీలించడంప్రారంభించారు. రికార్డుల పరిశీలన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. కాగా ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.