శ్రీరెడ్డి మీద కేసు!

గత కొన్నేళ్ళుగా నోటికొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డి మీద కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత‌ల‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్య‌లపై తెలుగుదేశం నేత రాజు యాదవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు త్రీటౌన్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. పరిస్థితిని చూస్తుంటే, శ్రీరెడ్డి ఇంతకాలం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించే సమయం ఆసన్నమైనట్టు అర్థమవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu