నకిలీ గోల్డ్ కాయిన్స్ ముఠా అరెస్టు!

ఫేక్ బంగారు నాణాలు విక్రయిస్తున్న ముఠాని హైదరాబాద్‌లోని షాపూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్ ఇస్తామని నమ్మిస్తూ పలువురిని ఈ ముఠా సభ్యులు మోసం చేశారు. ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి వంద బంగారు నాణాలు, 36 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణాలను విజయవాడలో తయారు చేయించి, హైదరాబాద్ పరిసరాల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ ముఠా చేతిలో ఎంతమంది మోసపోయారనే విషయాన్ని పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu