గ్యాంగ్‌రేప్.. నాలుగుసార్లు యాసిడ్ ఎటాక్

మహిళల భద్రతకు కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెబుతున్నప్పటికీ ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఏ మాత్రం మారలేదు..అత్యాచారానికి గురై, ఆపై మూడు సార్లు యాసిడ్ దాడి జరిగి ఎంతో మానసిక ధైర్యంతో జీవితాన్ని గడుపుతున్న యువతిపై దుండగులు నాలుగోసారి యాసిడ్ దాడికి దిగారు. రాయ్‌బరేలికి చెందిన మహిళ తన స్వగ్రామంలోనే 2008లో గ్యాంగ్‌రేప్‌కు గురైంది..ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 2011, 2013లో ఆమెపై యాసిడ్ దాడులు జరిగాయి. దీంతో ఆమె నివసిస్తున్న హాస్టల్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

 

అయినప్పటికీ ఈ ఏడాది మార్చిలో మరోసారి బాధితురాలిపై యాసిడ్ దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించి నష్టపరిహారం అందించారు. అంత పటిష్ట బందోబస్తు ఉన్నప్పటికీ నిన్న రాత్రి హాస్టల్ నుంచి మంచినీటి కోసం బయటకు వచ్చిన ఆమెపై నాలుగోసారి యాసిడ్ దాడికి పాల్పడ్డారు దుండగులు..దీంతో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు బాధితురాలిని కింగ్ జార్జ్ మెడికల్ వర్శిటీకి తరలించారు..ముఖానికి కుడివైపున యాసిడ్ గాయాలయ్యాయి..గతంలో సామూహిక అత్యాచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులే ఆమెపై వరుస దాడులకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu