మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 34 మంది షిర్డీ యాత్రికుల మృతి
posted on Jun 16, 2012 2:20PM
హైదరాబాదు లక్డిడికాపూల్ నుంచి 50 మంది షిర్డీ యాత్రికులతో బయలుదేరిన కాళేశ్వర ట్రావెల్స్‌కు చెందిన బస్సు శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 34 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ బస్సులో ప్రయాణించినవారిలో 14 మంది టిసిఎస్ ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో కొందరి వివరాలు వెల్లడయ్యాయి. మృతుల్లో సుమిత్ అశోక్, హిందు వెంకటేష్, సుబ్బారావు, జోసెఫ్, పూజితలుగా గుర్తించారు.
మిగతా వారిని చంద్రావతి, దీపిక, రంజిత్‌కుమార్, సాయిప్రణీద్, ఆజమ్మ, సావిత్రి, రాధిక, రామారావు, కిరణ్, సుష్మ, రజిత, గౌతమ్, సునిల్, ప్రవీణ్, సంతోష్‌కుమార్ గుప్త, వెంకట్రావు, జ్యోతికుమార్, యాదగిరి కిష్టయ్య, ఉమా మహేశ్వరి, దివ్య, వాణీమానస, జయవర్ధన్‌లుగా మహారాష్ట్ర అధికారులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.