ఆదిని విమర్శించే స్థాయా మీది.. బీటెక్ రవి
posted on Nov 22, 2025 9:44AM

వైసీపీ నాయకులకు ఆదినారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ పులివెందుల ఇన్ చార్జ్ బీటెక్ రవి అన్నారు. శుక్రవారం (నవంబర్ 21) విలేకరులతో మాట్లాడిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇంటికి వెళ్లాలంటూ ముందు తన ఇల్లు దాటి వెళ్లాలని సవాల్ విసిరారు. నోరుంది కదా అని ఇష్టారీతిగా మాట్లాడితే సహించేంది లేదన్న బీటెక్ రవి.. నాడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని మీరే హత్య చేసి మా మీద కేసు మోపాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
అనవసర వాగాడంబరం మాని సత్తా ఉంటే పులివెంొదుల మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించండి సవాల్ విసిరారు. సతీష్ రెడ్డి 5 సార్లు పోటీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయారని, ఆదినారా యణ రెడ్డి నాలుగు సార్లు పోటీ చేస్తే నాలుగు సార్లూ గెలిచారని చెప్పిన ఆయన రానున్న పులివెందుల మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తడిగుడ్డతో గొంతులు కోసే రకమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.