పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టాం.. ప్రధాని మోడీ
posted on May 22, 2025 5:23PM

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్ లోని బికనూర్ ఎయిర్ బేస్ ను గురువారం (మే 22) సందర్శించిన మోడీ ఆ తరువాత ఓ బహిరంగ సభలో మాడారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు.
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను కేవలం 22 నిముషాలలో ధ్వంసం చేశామన్నారు. గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో బదులు తీర్చుకున్నామని వెల్లడించారు. మన ఆడపడుచుల సిందూరం తుడిచిన ఉగ్రవాదులకు సిందూరం తుపాకి తూటాగా మారితే ఏం జరుగుతుందో చూపామన్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారనీ, ఆపరేషన్ సిందూర్ తో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారనీ ప్రధాని మోడీ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో తన నరాల్లో రక్తం కాదు సిందూరం మరిగిందన్న ప్రధాని మోడీ.. ఇక ముందు కూడా ప్రతి ఉగ్రదాడిని, ఉగ్ర చర్యనూ యుద్ధంగానే పరిగణిస్తామన్నారు.