బీజేపి ఎమ్మెల్యే… బస్సులో కిస్ చేశాడు! ఇప్పుడు బతుకు బస్టాండైంది!
posted on Jul 4, 2017 3:58PM

మహారాష్ట్రలో రవీంద్ర అనే పేరు పెట్టుకున్న రాజకీయ నేతలకు టైం బ్యాడ్ గా వున్నట్టుంది. ఆ మధ్య రవీంద్ర గైక్వాడ్ అనే శివసేన ఎంపీ చేశాడో గుర్తుందిగా? విమానాశ్రయంలో నానా రచ్చ చేశాడు. సిబ్బందిపై దాడి చేసి తన బలుపు చూపించుకున్నాడు. అంతే కాదు, తనని ఎవ్వరూ ఏం చేయలేరన్నట్టు వీడియోలో క్షమాపణ కూడా చెప్పనుపొమ్మని రెచ్చిపోయాడు. చివరకు, మనోడి కోసం శివసేన ఇతర ఎంపీలు లోక్ సభలో రచ్చ చేశారు. మన ఆశోక్ గజపతి రాజుపై దాడి దాకా వెళ్లారు! ఇంత కల్లోలానికి కారణం ఎవరు? రవీంద్ర గైక్వాడ్!
ఇప్పుడు మహారాష్ట్రకే చెందిన మరో రవీంద్ర సిగ్గుమాలిన పని చేశాడు! అయితే, ఈ రవీంద్ర బవన్ థాడే అనే నేత బీజేపి పార్టీవాడు! అధికారంలో వున్న కమలదళం ఎమ్మెల్యే ఎంత దిగజారొచ్చో అంతా దిగజారిపోయాడు! తన పరువు తీసుకోటమే కాక పార్టీని కూడా అవమానకర స్థితిలోకి నెట్టాడు!
బీజేపి తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర ఒక మహిళని బస్సులో ముద్దాడుతున్న వీడియో అనూహ్యంగా బయటపడింది. నాగ్ పూర్ నుంచీ చంద్రాపూర్ వెళ్తోన్న బస్సులో ఎమ్మెల్యేగారు ఈ ఘనకార్యం చేశారు. అదంతా బస్సులోని సీసీ టీవీలో రికార్డైంది. తరువాత ఇంటర్నెట్ లోకి పొక్కింది. దాంతో సదరు బాధితురాలు నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టింది! రవీంద్ర బవన్ థాడే తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడనీ, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడనీ… ఆమె ఆరోపిస్తోంది! ఆ సంగతులు ఎలా వున్నా ఎమ్మెల్యే నిర్లజ్జగా బస్సులో ఇతర ప్రయాణికులు కూడా వుండగానే… శృంగారానికి తెగబడటం మాత్రం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది!
తన మీద కేస్ బుక్కైనప్పటి నుంచీ రవీంద్ర బవన్ థాడే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇంకా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయలేదు. అధికార మహారాష్ట్ర బీజేపి కూడా ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. చూడాలి మరి… ప్రతిపక్షాలకు బలంగా దొరికిన ఈ అస్త్రాన్ని దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాలు ఎలా నిర్వీర్యం చేస్తారో! రేప్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించి అరెస్ట్ చేయించటం తప్ప మరో మార్గం లేనట్లేకనిపిస్తోంది!