బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి: విష్ణుకుమార్ రాజు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి చూసిన తరువాతైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకుడు  విష్ణుకుమార్ రాజు అన్నారు.

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. చెల్లని ఓట్ల తో పోటీ పడే పరిస్థితి రావడానికి కారణం రాష్ట్రంలో బీజేపీ అధికార వైసీపీతో కలిసి పని చేస్తోందని ప్రజలు భావించడమే కారణమని విష్ణుకుమార్ రాజు అన్నారు.

 రాష్ట్ర బీజేపీ వైసీపీతో అంటకాగుతోందన్న ముద్రను తొలగించుకోకపోతే ముందు ముందు మరింత దారుణమైన ఫలితాలను ఎదుర్కొన వలసి వస్తుందని పేర్కొన్నారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆదరించకపోవడాన్ని గమనించాలని, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఏవీ పనిచేయకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమని అన్నారు.  ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే మేలు జరుగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఈ కలయిక తప్పనిసరి అని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu