వల్లభనేనికి బిగ్ షాక్
posted on Feb 24, 2025 2:20PM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. మూడు రోజుల కస్టడీకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించడం వల్లభనేని వర్గీయులకు తీవ్ర నిరాశకు గురి చేసింది. కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు సోమవారం తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం విజయవాడ పరిధిలోనే పోలీసులు కస్టడీ తీసుకోనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలీసులు వంశీని ఇంటరాగేషన్ చేయనున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ప్రధాన నిందితుడు. ఇదే కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీని10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విన్నవిస్తే కోర్టు మాత్రం కేవలం మూడు రోజుల కస్టడీకి అప్పగించారు.