మ‌ర‌ణానంత‌ర  ప్ర‌యాణానుభ‌వం.. 

మ‌ర‌ణానంత‌ర జీవితం ఉంటుందా? ఇదేప్ర‌శ్న అనాదిగా చాలామంది రుషుల్ని, మాన‌సిక శాస్త్ర‌వేత్త‌ల్ని అడు గుతున్న ప్ర‌శ్న‌. క‌డు దుర్ల‌భం అన్న‌ది అనేక మంది స‌మాధానం. కానీ ఎక్క‌డో  ఒక‌చోట అప్పుడ పుడు కొన్ని వింత‌లు జ‌రుగుతూంటాయి. లోక‌మంతా ఆశ్చ‌ర్య‌ప‌డ‌టం ప‌రిపాటిగానూ మారింది. ఇటీవ‌లి కాలంలో ఇలాంటిదే జ‌రిగింది. జెస్సీసాయ‌ర్‌, బెట్టీ జె.ఈడీ అనే స్నేహితుల‌కు ఇలాంటి అనుభ‌వ‌మే అయింది. మ‌ర‌ణించే స‌మ‌యంలో ఊహంచని విచిత్రం చూశారు.

78 ఏళ్ల బెట్టీ ఆనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరింది. ఆప‌రేష‌న్ విఫ‌ల‌మై ఆమె చ‌నిపోయింది. కానీ శ‌రీరం నుంచీ ఆత్మ విడిపోయే సెకండులో బెడ్ మీద త‌న శ‌రీరాన్ని చూసుకుందిట‌. ఆమె ప్రాణం పోయిన త‌ర్వా త ముగ్గురు రుషుల్లాంటివారిని చూసింద‌ట‌. త‌న ఆత్మ రాకెట్ వేగంతో త‌న నివాసానికి వెళ్లి ఇంట్లో ఉన్న వారిని చూసింది. ఆ త‌ర్వాత పెద్ద గుహ‌లోకి వెళ్లింది, అక్క‌డ జీస‌స్ ద‌ర్శ‌న‌మిచ్చాడ‌ట‌. ఆయ‌న ఆమెను హ‌త్తుకుని బిడ్డా, ఇది నీవు నీ శ‌రీరాన్ని విడిచే స‌మ‌యం కాద‌ని అన్నార‌ట‌. ఆ త‌ర్వాత ముగ్గురు దేవ‌క‌న్య లు చ‌క్క‌ని తోట‌లోకి తీసికెళ్లి ఆమెకు మ‌ర‌ణ స‌మ‌యం కాద‌ని నీ శ‌రీరాన్ని వెళ్లి చేరు అనే ఆదేశించారు

ఇదంతా జ‌రిగిన ఐదేళ్ల త‌ర్వాత ఆమె మెడిక‌ల్‌గా కొంత స‌మ‌యం మ‌ర‌ణించింద‌ని అది ఎలా జ‌రిగిందీ డాక్ట‌ర్లు వివ‌రించారు. ఆమె బ‌తికి వాళ్లంద‌రికీ తాను అనుభ‌వించిన దివ్యానుభ‌వాన్ని పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌న అనుభ‌వాల‌తో ఇపుడు ఆమె ఎంబ్రాస్డ్ బై లైట్ అనే పేర పుస్త‌కం రాస్తోంది.  ఇదంతా సాధ్య‌మా, ఇలా జ‌రుగుతుందా అంటే కొన్ని సంఘ‌ట‌న‌లు, సంద‌ర్భాలు న‌మ్మాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu