భార‌త్ పాక్ పై ఎలాంటి యుద్ధ వ్యూహం ర‌చిస్తోంది... మ‌న ద‌గ్గ‌రున్న ఎవిడెన్సులు ఏంటి?

ఉగ్ర‌దాడికి భార‌త్ గ‌ట్టి బ‌దులే ఇస్తుంది. అది మ‌రెవ్వ‌రూ ఊహించ‌న‌దిగా ఉంటుంది. ఇదీ మోడీ ప‌హెల్గామ్ అటాక్ త‌ర్వాత చేసిన కామెంట్. మోడీ ఇంత సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం ఇదే మొద‌టి సారి. అయితే ఇప్ప‌టికే సింధూ జ‌లాల ఒప్పందం ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోడీ. యుద్ధం చేయ‌డం కంటే నీళ్లు ఆప‌డం అతి పెద్ద యుద్ధం. దీని సాధ్యాసాధ్యాలు వ‌చ్చే రోజుల్లోగానీ తెలీదు. అలాగ‌ని ఇదే చాల‌నుకున్నా క‌ష్ట‌మే. ఎందుకంటే ఇందుకు కావ‌ల్సినంత టైం తీస్కుంటుంది. ఈలోగా ఇలాంటి ఎన్నో ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది. దానికి తోడు ఇదే అంశంపై ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యిద్ మీరు మా నీరు ఆపితే మేము మీ శ్వాస ఆపేస్తామ‌ని.. ఈ స‌రికే ప్ర‌క‌టించి ఉన్నాడు.. రీసెంట్ గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావ‌ర్ భుట్టో సైతం స‌రిగ్గా ఇలాంటి లాంగ్వేజీనే వాడి భార‌త్ ను హెచ్చ‌రించాడు. దీన్నిబ‌ట్టీ చూస్తే ఈ లాగ్ తో కూడిన  వాట‌ర్ వార్ తో పాక్ ని అంత తేలిగ్గా భ‌య‌పెట్ట‌లేం. ఇక మిగిలింది ఏంట‌ని చూస్తే..ముందుగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనే విమాన వాహ‌క యుద్ధ నౌక‌ను అరేబియా స‌ముద్రంలో అంత‌ర్జాతీయ జ‌లాల‌లో ఉండేలా.. కారాచీ రేవుకు ద‌గ్గ‌ర్లోకి పంపారు. ఒక ర‌కంగా చెబితే ఇది పూర్తి స్థాయి యుద్ధ స‌న్న‌ద్ధానికి స‌మాయుత్తం అవుతున్న‌ట్టుగానే భావించాలంటారు ర‌క్ష‌ణ రంగ నిపుణులు.విక్రాంత్ అనే విమాన వాహ‌క నౌక అంటే అది ఒక్క‌టే వెళ్ల‌దు. దీంతో పాటు నాలుగు ఫ్రీగెట్ లు, ఒక కార్వేటి, రెండు డెస్ట్రాయ‌ర్లు ఉంటాయి. ఇవే కాక‌.. వీటిని అనుస‌రిస్తూ స‌ముద్ర జ‌లాల్లో రెండు అటాక్ స‌బ్ మెరైన్లు ప్ర‌యాణిస్తాయి. ఈ మొత్తాన్ని క‌లిపి కారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు షార్ట్ క‌ట్ లో సీటీజీ అంటారు.యుద్ధం జ‌రుగుతోంద‌న్న నిర్ణ‌యిస్తేనే ఈ కారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్ ని పంపుతారు. 

కాబ‌ట్టి ఈసారికి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అయితే ఉండ‌బోదని అంటున్నారు ఎక్స్ ప‌ర్ట్స్. ఒక సారి అంటే 2016లో అజిత్ దోవ‌ల్ అన్న‌మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. పాకిస్థాన్ కానీ మ‌రో ముంబై లాంటి దాడుల‌కు పాల్ప‌డితే బ‌లూచిస్తాన్ని కోల్పోతారని అన్నారాయ‌న‌. అంటే దీన‌ర్ధ‌మేంటో సుల‌భంగానే అర్ధం చేసుకోవ‌చ్చు. ఇంతకీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఎందుకు చేయ‌కూడ‌దు? అని చూస్తే ఇప్ప‌టికే రెండు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసింది భార‌త్. మొద‌టిది యూరీ సెక్టార్లో ఆర్మీ నిర్వ‌హించ‌గా.. రెండోది బాలాకోట్ పై ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చేసిన‌ది.  ఇక మిగిలింది ఇండియ‌న్ నావీ తో స్ట్రైక్స్ చేయించ‌డం. అయితే నావీ అలాంటి స్ట్రైక్స్ చేయ‌దు. డైరెక్ట్ వారే.  ఇదిలా ఉంచితే పీవోకేని స్వాధీనం చేసుకోవ‌డం. పీవోకేని స్వాధీనం చేసుకునే స‌మ‌యంలో పాకిస్థాన్ నావీ భార‌త్ పై దాడి  చేయ‌కుండా నిలువ‌రించ‌డానికే విక్రాంత్ ని అరేబియా స‌ముద్రంలో మొహ‌రించార‌ని అంటారు నిపుణులు. ఇక బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీకి మ‌ద్ద‌తుగా గ్వ‌ద‌ర్ పోర్టు వైపు విక్రాంత్ ని పంపి ఉండొచ్చు కూడా. ఇక్క‌డ స‌స్పెన్స్ ఏంటంటే భార‌త్ అస‌లు యుద్ధ వ్యూహ‌మేంట‌న్న‌ది. ఇండియ‌న్ ఆర్మీ ప్లాన్ ఏమిటో ఎవ‌ర‌కీ తెలియ‌దు. ఏద‌యినా జ‌ర‌గొచ్చు కూడా. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ రెండున్న‌ర ల‌క్ష‌ల ఫ్రంట్ ల‌తో యుద్ధం చేయాల్సి ఉంటుంద‌ని భావించేవారు. ఇప్పుడు చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది ప‌రిస్థితి. పాకిస్థాన్ త్రీ ఫ్రాంట్ వార్ ఫేస్ చేయాల్సి రావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.అదెలాగో చూస్తే మొద‌ట బ‌లూచ్ లిబ‌రేష‌న్ ఆర్మీని భార‌త్ నావీ స‌పోర్ట్ తో పాక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖైబ‌ర్ ప‌ఖ్క్తున్ క్వాని తాలిబాన్లు అటు నుంచి ముట్ట‌డిస్తారు. కాశ్మీర్ వైపు భార‌త దాడిని చ‌వి చూడాల్సి వ‌స్తుంది. ఇక్క‌డ గుర్తించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ఇప్ప‌టికే తాలిబ‌న్లు భార‌త్ కి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మోడీతో మాట్లాడుతూ త‌న స‌పోర్ట్ తెలియ చేశారు. ఇదెలా ప‌నికి  వ‌స్తుందంటే.. మ‌న ఆయ‌ధాల‌లో 70 శాతం పైగా సోవియ‌ట్ ర‌ష్యాకి చెందిన‌వి ఉన్నాయి. వీటి స్పేర్ పార్ట్స్ అవ‌స‌రాలు చాలానే ఉంటాయి. ఈ మాత్రం సాయం చేసినా చాలు మ‌నం యుద్ధాన్ని ఎంతో గొప్ప‌గా చేయ‌గ‌లం అంతే స్థాయిలో ముగించ‌గ‌లం.ఇక అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా ఫోన్ చేసి త‌న స‌పోర్ట్ ప్ర‌క‌టించారు. ఈ దిశ‌గా త‌న యంత్రాంగం ద్వారా ఒక అధికారిక ప్ర‌క‌ట‌న సైతం చేయించారు. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మ‌క్రాన్ మోడీకి గ‌ట్టి మ‌ద్ధ‌తే ప్ర‌క‌టించారు. మిరేజ్ 200 జెట్ ఫైట‌ర్స్, రాఫెల్ ఓమ్ని రోల్ ఫైట‌ర్ జ‌ట్స్ ఫ్రాన్స్ కి చెందినివి కావ‌డం గుర్తించాల్సిన విష‌యం.కాబ‌ట్టి పాక్ పై మోడీ ఎలాంటి అటాక్ చేసినా అడిగే దిక్కు లేదు. ప్ర‌పంచ ఉగ్ర‌వాద క‌ర్మాగారం పాక్ లో తిష్ట‌వేసి.. అక్క‌డి నుంచి ప్ర‌పంచం మీద‌కు వ‌దులుతోంద‌ని స్ప‌ష్టంగా తెలిసి పోతోంది. ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి వ్యాఖ్య‌లే ఇందుకు సాక్షి.ప‌హెల్గామ్ దాడి జ‌ర‌గ్గానే పాకిస్థాన్ వెంట‌నే త‌న ఎయిర్ స్పేస్ మూసేసింది. ఎప్పుడైనా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌ర‌గొచ్చ‌నే భ‌యంతో క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర‌కు త‌ర‌లించారు. బ‌లూచిస్తాన్ లో ఉన్న సైన్యాన్ని పీఓకీ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర‌కు త‌ర‌లించే టైంలో నిన్న పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి ప‌ది మంది పాక్ సైనికుల‌ను చంపింది బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ.మ‌రోవైపు క‌రాచీ ఓడ‌రేవుకు ద‌గ్గ‌ర్లో పాకిస్థాన్ నావీ  డ‌మ్మీ మిస్సైల్స్ ప్ర‌యోగించి టెస్ట్ చేస్తోంది. శుక్ర‌, శ‌ని.. రెండు రోజుల పాటు అరేబియా స‌ముద్రంలో నావీ డ్రిల్ ఉంటుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది.. పాపిస్తాన్...కాబ‌ట్టి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అయితే ఉండ‌ద‌ని క‌న్ఫం అయ్యింది. ఇక మిగిలింది ఏంటంటే పూర్తి స్థాయి లేదా పాక్షిక యుద్ధం మాత్ర‌మే మిగిలాయి. పాకిస్థాన్ యుద్ధ ఖ‌ర్చు భ‌రించ‌గ‌ల‌దా? అన్న‌ది మ‌రొక ప్ర‌శ్న‌.  అయితే ఇది ఎంతో క‌ష్ట‌సాధ్య‌మైన ప‌ని. ఒక సారి యుద్ధం ప్ర‌క‌టిస్తే.. ముందుగా గోధుమ‌లు చ‌క్కెర‌, బియ్యం, పెట్రోల్- డీజిల్ పై రేష‌న్ విదిస్తుంది పాక్ ఆర్మీ. ముందు సైన్యానికి స‌ర‌ఫ‌రా చేశాక మిగిలితే సాధార‌ణ  పౌరుల‌కు అమ్మాల్సి వ‌స్తుంది.యుద్ధం లేని  టైంలో కూడా పాకిస్థాన్ కి గోధుమ పిండి క‌ర‌వుగా ఉంది. ఈ సిట్యువేష‌న్లో ఆ కాస్త పిండి  కూడా సైన్యం ప‌ట్టుకుపోతే ప‌రిస్థితేంటి? ఇక సాధార‌ణ  పాకిస్తానీయుల ఆహాకారాలు ఆకాశాన్ని అంట‌డం ఖాయం. 


ఇప్ప‌టికే న‌గ‌రాల మాట అటుంచితే.. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సంగ‌తి దేవుడెరుగు ప‌గ‌టి పూట కూడా క‌రెంటు స‌ప్లై ఉండ‌టం లేదు. ఇక యుద్ధం మొద‌లైతే న‌గ‌రాలు కూడా చీక‌ట్లో అల‌మ‌టించాల్సి వ‌స్తుంది. ఆయుధాల క‌ర్మాగారాల‌కు ఈ విద్యుత్ మొత్తం మ‌ళ్లించాలి కాబ‌ట్టి.. ఈ మాత్రం క‌రెంటు కోత పాకీయుల‌కు త‌ప్ప‌దు.కాబ‌ట్టి పాకిస్థాన్ యుద్ధం చేయ‌డం మాత్ర‌మే కాదు చేయ‌డానికి ప్లాన్ చేసుకోవ‌డం కూడా గ‌గ‌న‌మే.. కొన్నాళ్లు పాటు ఎలాంటి యుద్ధం చేయ‌కుండా యుద్ధ స‌న్నాహాల్లో ఉంచినా  చాలు పాకిస్థాన్ వ్య‌వ‌స్థ మొత్తం నిలువునా  కుప్ప‌కూలిపోతుంది. ఎందుకంటే యుద్ధం చేయ‌డానికి వంద రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌నుకుంటే, యుద్ధ స‌న్నాహం కోసం యాభై రూపాయ‌లు వెచ్చించాల్సి వ‌స్తుంది. ఈ మొత్తం ఖ‌ర్చు చేస్తే చాలు పాకిస్తాన్ మ‌ల‌మ‌ల‌మాడిపోవ‌డానికి.  ఇప్ప‌టికే యుద్ధ భ‌యానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ మూత ప‌డింది. ఇక కొన్నాళ్లు ఇలాగే ఉంటే మార్కెట్ల మీద ఎగ‌బ‌డి అవీ ఇవీ ఎగ‌బ‌డి కొనేస్తారు పాకిస్తానీలు. ఇక క‌రాచీ పోర్టు మీద దాడి చేస్తే  దిగుమ‌తులు వెంట‌నే ఆగిపోతాయి. ఇండియ‌న్ నావీ క‌రాచీ పోర్టును దిగ్బంధించే ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. స‌ప్లైస్ ఆగినా చాలు పాకిస్థాన్ ఖేల్ ఖ‌తం కావ‌డానికి. చూశారుగా అదీ పరిస్తితి. కేవ‌లం 26 మంది  ప్రాణాల‌ను తీసిన  పాపానికి దేశం మొత్తం గ‌జ‌గ‌జ ఒణ‌కాల్సిన‌ప‌రిస్థితి. అవ‌స‌ర‌మా ఇదంతా అంటూ పాకిస్తానీయులు తెగ కుమిలిపోతున్నారు. ఏం చేద్దాం వారి చేతుల్లో కూడా ఏమీ ఉండ‌దు. పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ టెర్ర‌రిస్టులు ఇదో టెర్ర‌ర్ కారిడార్. ఈ మొత్తం లింకు తెగితే గానీ పాపం పాకిస్థానీయుల‌కు సైతం ఊర‌ట ల‌భించ‌దు. దీన్నే ప్ర‌పంచ అగ్ర దేశాలు గుర్తించి తునాతున‌క‌లు చేయాల్సి ఉంటుంది. మ‌రి చూడాలి... ప్ర‌పంచ‌మంతా క‌ల‌సి ఇప్పుడు భార‌త్ ద్వారా  ఎలాంటి యాంటీ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ చేయిస్తాయో తేలాల్సి ఉంది.