బాలకృష్ణ షాకింగ్ డెసిషన్... షాక్ లో ఫాన్స్!!

 

 

 

ఎన్టీఆర్ తనయుడు బాక్స్ ఆఫీస్ బొనాంజా, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో  రాజకీయాల పై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. దీని కోసం సినిమాలకు కూడా కొంత  విరామం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను, వీవీ వినాయక్‌తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం కేఎస్ రవికుమార్‌తో చేసే సినిమా పూర్తయిన తర్వాత కొంతకాలం రాజకీయాల మీద దృష్టి పెట్టి..  కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు చేసే ఆలోచనలో బాలయ్య బాబు ఉన్నట్టు సమాచారం. బాలకృష్ణ తీసుకున్న ఈ  డెసిషన్ తో ఏడాదికో సినిమా మాత్రమే చేసి.. మిగిలిన సమయాన్ని తన తండ్రి స్థాపించిన టీడీపీ బలోపేతం కోసం కేటాయించాలని అయన ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం టీడీపీ రాజకీయంగా గడ్డు పరిస్థితులలో ఉండటం అలాగే పార్టీ కీలక నేతలు ఎప్పుడు ఎవరు పార్టీకి బై  బై చెబుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గడచిన ఎన్నికల్లో టీడీపీ రాయలసీమలో మూడే  స్థానాలు గెలవటంతో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పరిస్థితులలో ముఖ్యంగా రాయలసీమలో బాలకృష్ణకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.  దీనితో కనీసం వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేయాలంటే బాలయ్యకూడా తన వంతు సహకారం అందించాలని చంద్రబాబు కూడా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu