బద్వేలులో నకిలీ ముఠా గుట్టురట్టు

 

కడప జిల్లాలో నకిలీ పట్టాల దందాకు పేరుగాంచిన బద్వేల్ లో మరోసారి నకిలీ భాగోతం బయట పడింది . మూడేళ్ల క్రితం ఇలాంటి ముఠాల గుట్టు రట్టు చేసి భారీ ఎత్తున నకిలీ పత్రాలు,సీల్లు స్వాధీనం చేసుకుని . సుమారు 20 మందిపై ప్పట్లో కేసులు  నమోదు చేశారు. తాజాగా ఇదే తంతు మరోసారి బద్వేల్లో కలకలం రేపింది. డికెటి పెట్టాలు, పాస్ బుక్ లు, అనుబంధ పత్రాలు సృష్టించే వారి బాగోతం బయట పడింది. పదిమంది కలిగిన ముఠాపై  పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఒక మహిళతో పాటు తొమ్మిది మంది ని అరెస్ట్ చేసి ఆ వివరాలను  పోలీసులు  వెల్లడించారు. 

బద్వేలు పట్టణంలో నకిలీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలపై కొద్దిరోజులుగా పోలీసులు లోతుగా విచారిస్తూ వచ్చారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక ఇంటి పట్టాకు సంబంధించి  విచారణ చేపట్టడంతో  బారీగా నకిలీ వ్యవహారం బయట పడింది. పట్టణంలో నకిలీ పట్టాల సృష్టి, దొంగ సీల్ల తయారీ వ్యవహారం చాలా కాలంగా సాగుతున్నట్లు అధికారులు దృష్టికి వచ్చింది. ఆ మేరకు సమగ్రంగా విచారించి వీటిని స్వాధీనం చేసుకొని పదిమందిపై  కేసు నమోదు చేశారు. 

మొత్తం పది మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్ల పేర్కొన్నారు . బద్వేలులో నకిలీ గుట్టు రట్టు చేసిన  పోలీసులు, నిందితుల నుంచి నకిలీ పట్టాలు, అనుబంధ ఫారాలు, పాసుబుక్కులు, రెవిన్యూ అధికారుల నకిలీ సీళ్లతో పాటు పలు కీలకమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా ఎంతకాలంగా  నకిలీ పత్రాల ద్వారా ప్రజలను మోసం చేస్తుంది.ఇంకా ఎన్ని ఇలాంటి నకిలీ పత్రాలు సృష్టించారు అనే అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu