ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న

ఏపీలో ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ  నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదల చేస్తూ బుధవారం ఎన్నికల సంఘం ఉత్వర్వులు జారీ చేసింది.

ఆత్మకూరుతో పాటు దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలలో కూడా ఉన ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ మేరకు ఆత్మకూరు ఉప ఎన్నికకు ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 6 ఃనామినేషన్ల దాఖలుకు తుదిగడువు. జూన్ 9 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.  జూన్ 23న పోలింగ్ జరుగుతుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.