ఆసుపత్రి నుంచి కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష

 

సాధారణ వైద్యల పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ప‌రామ‌ర్శించేందుకు పార్టీ నేతలు ప‌లువురు వచ్చారు. ఈ సందర్భంలో వారితో గులాబీ బాస్ ఇష్టాగోష్టి నిర్వహించారు. 

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరి వంటి అంశాలను పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu