వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన సంగతి విదితమే. పోలీసుల ఎదుట అనంతబాబు తానే హత్య చేశానని అంగీకరించిన తరువాత కూడా పార్టీ ఆయనను వెనకేసుకు వస్తున్నట్లుగానే మాట్లాడిన సంగతి విదితమే.

అరెస్టయిన రోజుల తరువాత కూడా పార్టీ పరంగా ఏ చర్యా తీసుకోని వైసీపీ ఎట్టకేలకు సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పోలీసుల ఎదుట తానే హత్య చేసినట్లు అంగీకరించిన అనంతబాబును కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

అనంతబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో చెప్పారు. పార్టీ పరంగా చర్యలపై విలేకరుల అడిగిన ప్రశ్నకు ఆ సంగతి పార్టీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య‌పై విప‌క్షాలు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో అనంత‌బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ  నిర్ణ‌యం తీసుకుంది.