పుట్టలో వేలెడితే చీమ కుడుతుంది.. సింహం నోట్లో వేలెడితే..!

చీమ తన ప్రైవసీని దెబ్బతీస్తుంటే ఊరుకోదు. కుట్టి వదిలి పెడుతుంది. చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే పుట్టలో వేలెడితే కుట్టనా అందట.. అలాంటిది సింహం నోట్లో వెలు పెడితే ఊరుకుంటుందా.

వేలుకి కసుక్కున కొరికేసి చప్పరించేస్తుంది. అదే జరిగింది ఒడిశాలో. జూలో బోనులో ఉన్న సింహమే కదా అనుకున్నాడో ఆకతాయి. తన ఆకతాయి చేష్టలతో దానికి రెచ్చగొట్టాడు. జూలు పీకాడు. నోట్లో వేలెట్టి ఆడాడు. కోపంతో ఒళ్లు మండిన సింహం లటుక్కున ఆ వేలుని కొరికేసింది. దాని నోట్లోంది వేలు తీసుకోవడానికి నానా యాతనలూ పడ్డాడా ఆకతాయి

అయినా లాభం  లేకపోయింది. చివరికి ఏం జరిగిందంటే అతడి ఉంగరం వేలు ఆ సంహానికి పలహారమైపోయింది. ఈ సంఘటన మొత్తం జూలో ఉన్నవారు తమ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయిపోయింది.  జూ అధికారులు ఆ ఆకతాయిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి...ఇలాంటి ఆకతాయి పనులు చేస్తే శాస్తి ఇలాగే ఉంటుందని మందలించి వదిలేశారు.