సీఎం యోగిపై ప్రశంసలు..ఎమ్మెల్యే పూజా పాల్‌పై వేటు
posted on Aug 14, 2025 4:38PM
.webp)
ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాఫియా ఆగడాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సస్పెండ్ చేయటం చర్చనీయాంశమైంది.
నా భర్తను చంపిన అతీక్ అహ్మద్ లాంటి క్రిమినల్స్‌పై సీఎం యోగి తీసుకుంటున్న చర్యలు మహిళలకు వెంటనే న్యాయం జరిగేలా చేస్తున్నాయి. ఆయనకు ధన్యవాదాలు అని ప్రశంసించారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ పార్టీ హైకమాండ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకు చర్యలు తీసుకున్నాట్లు పేర్కొన్నారు.
2005లో సమాజ వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడింది.. గ్యాంగస్టర్లు అతీక్ అహ్మద్‌తోపాటు అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే రాజు పాల్‌ను పూజా పాల్ పెళ్లి చేసుకున్న కేవలం 10 రోజులకే ఈ మర్డర్ జరిగింది. ఇక గ్యాంగస్టర్లు అతీక, అష్రాఫ్‌లు 2023లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూజా పాల్ శాసన సభలో సీఎం యోగి అదిత్యను ప్రశంసించారు.