హైకోర్టులో వైసీపీకి షాక్

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను  హైకోర్టు కొట్టివేసింది. జడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్‌ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని వైసీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. 

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్‌ అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని, ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి  6,267 ఓట్లతో గెలిచారు
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu