ఆప్కాబ్ ఛైర్మన్‌గా పిన్నమనేని
posted on Apr 10, 2015 9:28AM

ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) నూతన అధ్యక్షునిగా కృష్ణా జిల్లాకు చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఈ బ్యాంకును కూడా రెండుగా విభజించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ శాఖకు పాలకవర్గాన్ని ఎన్నుకోవలసి వుంది. ఆప్కాబ్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. టీడీపీకి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావుకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, వైసీపీలకు చెందిన డీసీసీబీ అధ్యక్షులు కూడా సుముఖత చూపడంతో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఉపాధ్యక్ష పదవి కోసం తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు వరుపుల రాజా, నెల్లూరు అధ్యక్షుడు ధనుంజయ్ రెడ్డి, ప్రస్తుత ఉపాధ్యక్షుడు రత్నం పోటీపడుతున్నారు.