చంద్రబాబుకు వ్యతిరేకంగా అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు..
posted on Jun 6, 2016 10:34AM

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వసతులు కల్పించకుండా రమ్మంటున్నారు..అక్కడ వసతులు లేకుండా మేం వచ్చి ఏం చేస్తాం అని అన్నారు. అంతేకాదు.. ఉద్యోగుల తరలింపుపై ప్రభుత్వానికి స్పష్టత లేదుట.. జూన్ 27నాటికి సచివాలయం పూర్తవుతుందన్న నమ్మకం లేదు.. ఉద్యోగుల్లో అపనమ్మకం ఏర్పడింది.. ఉద్యోగుల పట్ల ఉదాసీదంగా వ్యవహరించవద్దు.. అన్ని వసతులు కల్పించిన తరువాతే వస్తాం అని తేల్చి చెప్పారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 27 నాటికల్లా హైదరాబాద్లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ అమరావతి వచ్చి తీరాల్సిందే అని ఆదేశించారు. మరి ఇప్పుడు అశోక్ బాబు ఇలాంచి వ్యాఖ్యలు చేశారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.