జగన్ కన్నా కేటీఆర్ చాలా బెస్ట్.. టీడీపీ నేతలు
posted on Oct 16, 2015 1:04PM

ఏపీ టీడీపీ నేతలు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ప్రశంసిస్తున్నారు. జగన్ కంటే కెటీఆరే బెస్ట్ అంటూ కితాబులిస్తున్నారు. ఎందుకనుకుంటున్నారా... ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పూనుకున్న సందర్భంగా పలువురు అతిధులను ఆహ్వానించనున్నారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం భిన్నంగా తాను రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పిలవద్దని.. పిలిచినా రానని.. రాకపోతే రాలేదని నిందించవద్దని చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కన్నా తెలంగాణ మంత్రి కేటీఆర్ చాలా బెస్ట్ అని.. రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచిన వెంటనే వస్తానని చెప్పారని అన్నారు. ఈ లేఖతో అతని బుద్ధి బయట పడిందని.. ఆయన వైఖరి అభివృద్ధికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన శంఖుస్థాపన కార్యక్రమానికి రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.