పదవుల కోసం వీరి ముగ్గురు చుట్టూ ప్రదక్షిణలు
posted on Oct 16, 2015 12:46PM

దేవుడి గుడిలో దేవుడి చుట్టూ ప్రదిక్షణలు చేసినట్టు ఇప్పుడు తెలంగాణలో ఉన్న నేతలు ఇప్పుడు ముగ్గుర మంత్రుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఉన్న పదవులు అన్ని పంచేస్తాం అని చెప్పారు. దీనికి సంబంధించి కేసీఆర్ ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అది ఎవరో కాదు.. మంత్రి హరీష్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈ పదవులకు తగ్గ అర్హులను ఎంపిక చేసే బాధ్యత వీరి ముగ్గురిపై పెట్టడంతో ఇప్పుడు తెలంగాణలోని ఆశావహులంతా కూడా ఆ ముగ్గురి చుట్టూ పదేపదే ప్రదక్షిణలు చేయడం జరుగుతోంది. అంతేకాదు ఈ పదవులు ఆశించేవారిని సిఫార్స్ చేయదలచుకున్న వారు కూడా ఈ మంత్రుల చుట్టూ తిరగాల్సిందే.