లిక్కర్ స్కాంలో జగన్ అరెస్ట్ కావడం ఖాయం
posted on Aug 3, 2025 4:50PM

లిక్కర్ స్కాంలో మాజీ సీఎం జగన్ అరెస్టు కావడం ఖాయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ మద్యం కుంభ కోణం కన్నా ఇదీ పెద్దదని అంతటా ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంటే ఇక్కడి లిక్కర్ షాపులో మాత్రం క్యాష్ తీసుకొని మద్యం అమ్మకాలు చేశారని ఖచ్చితంగా స్కాం జరిగిందని విచారణ జరుగుతుందని అందరు శిక్ష అనుభవిస్తారని టీజీ భరత్ అన్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో కలిసి సింగపూర్‌లో పర్యటించామని గత ప్రభుత్వం సింగపూర్ ను తప్పుడు విధంగా చిత్రీకరించి వారి మంత్రులు విచారణ, అవినీతి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి రాష్ట్రంపై ఉన్న అపోహలు తొలగించారని త్వరలోనే సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
తమకంటూ విజన్ ఉందని దానికి అనుగుణంగా పనిచేస్తూ వెళ్తున్నామని, సింగపూర్,గుజరాత్ లో స్థిరంగా ప్రభుత్వం కోసగడంతో అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చిందన్నారు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం స్థిరంగా కొనసాగితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని,తాము కుదుర్చుకున్న ఒప్పందాలను త్వరలోనే వెల్లడిస్తామని, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహాలు సంబంధించి మంత్రి నారా లోకేష్ త్వరలోనే సంచలమైన నిర్ణయం తీసుకోబోతున్నారని టీజీ భరత్ వెల్లడించారు.