అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ శంఖనాదం
posted on Oct 14, 2015 4:15PM

దసరా రోజు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఏ ముఖ్యమంత్రో.. ఇంకెవరో అనుకుంటున్నారా? కాదు. అది ఎవరంటే.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో శంఖం ఊదేందుకు శంఖేశ్వర్ ను ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన శంఖేశ్వర్ శంఖం ఊదడంలో నిష్ణాతుడు. ఈయన గురించి ప్రముఖ సంఘ సేవకుడు రామచంద్ర డోంగ్రీజీ మహరాజ్ గోశాల ట్రస్టీ జస్ మత్ భాయ్ పటేల్ ద్వారా తెలుసుకున్న టీడీపీ వర్గాలు ఆయనతో శంఖం ఊదించాలని నిర్ణయం తీసుకొని ఆయనను ఆహ్వానించినట్టు చెబుతున్నారు. కాగా శంఖేశ్వర్ కు రెండు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయనతో శంకునాదం చేయిస్తుంటారు. ఆయన మంచినీళ్లు కూడా తాగకుండా ఏకధాటిగా 1100 సార్లు శంఖనాదం చేయగలరు.