3.24 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట
posted on Feb 28, 2025 6:26AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28) అసెంబ్లీలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ప్రవేశ పెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దాదాపు 3.24 లక్షల కోట్లతో ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో పెద్ద నపీట వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నిధుల కేటాయింపు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశ పెడితే, మంత్రి నారాయణ మండలిలో ప్రవేశ పెడతారు. కాగా బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అద్యక్షతన జరిగే కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది.