జగన్ రికార్డ్ సృష్టించాడు.. ఉమా.. కుక్కలు మొరిగాయ్
posted on Mar 14, 2016 2:50PM

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈసందర్బంగా అధికార పక్ష, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే బోండ ఉమ మాట్లాడుతూ.. జగన్ వైఖరి నచ్చకే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని.. అధికార కాంక్షతో అవిశ్వాస తీర్మానం పెట్టారని.. వైసిపి ఎమ్మెల్యేలే దీనిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అంతేకాదు.. ఏపీ అభివృద్ది ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుతోనే సాధ్యమని.. ప్రజలు కూడా ఆ విషయాన్ని గమనించే టీడీపీని గెలిపించారని అన్నారు. కానీ జగన్ మాత్రం అధికార దాహంతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాదు తనపై ఉన్న కేసుల గురించి కూడా ఉమ ప్రస్తావించారు. 420 కేసులు, 11 ఛార్జీషీట్లు, 16 నెలలు జైలులో ఉన్న ముఖ్యమంత్రి కొడుకుగా జగన్ రికార్డ్ సృష్టించాడని బోండ ఉమ ఎద్దేవా చేశారు.
దీనికి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. గజరాజు నడుస్తుంటే కుక్కలు మొరుగుతాయని టీడీపీ నేతలను కుక్కలతో పోలుస్తూ ఎద్దేవ చేశారు.