జగన్ అవిశ్వాసంపై సభలో రచ్చ..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. తమ పార్టీ నుండి 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన నేపథ్యంలో ఈయన ఈ 8మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయించి, ఉప ఎన్నికలకు జరిగేలా చూడడానికి తాము చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా  అధికార పక్ష నేతలు.. ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతోంది. జగన్ ఆరోపణలు చేస్తుండగా.. వాటికి ధీటుగా అధికార పక్ష నేతలు కౌంటర్లు.. సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.