రాజకీయాల్లోకా.. నో వే.. అనుపమ్ ఖేర్

అమీర్ ఖాన్ అసహనంపై చేసిన వ్యాఖ్యలపై అందరి సంగతేమో కానీ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కాస్త ఎక్కువగానే స్పందిచారన్న దాన్లో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆయన పాలిటిక్స్ ఎంట్రీపై అందరికి సందేహాలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయనకు ఈ తరహా ప్రశ్నే ఎదురైంది. దీంతో ఆయన స్పందించి.. తాను రాజకీయాల్లోకి రావడం అసాధ్యమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోనని తేల్చిచెప్పారు. అంతేకాదు రాజకీయాల్లోకి రాకపోయినా తాను కోట్లాదిమంది భారతీయులకు ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడతానని ఆయన ప్రకటించారు. కాగా అనుపమ్ భార్య కిరణ్ ఖేర్ బీజేపీలో చేరి ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu