మీరే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి.. చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో టీ.టీడీపీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు తాము వ్యూహాలు సిద్దం చేశామని నేతలు చంద్రబాబుకు తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ చేయాలని.. ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలన్న విషయం నేతలు చర్చించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలోనే వారు మహబూబ్ నగర్ నుంచి పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డిని బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ భావించి.. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ... మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా జిల్లాల పర్యటనలను ఖరారు చేసుకోవాలన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu