చంద్రబాబును కేసీఆర్ కలవనున్నారా?
posted on Dec 2, 2015 3:53PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు కలుసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు చంద్రబాబు రావుల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడి వివాహం సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. అయితే కేసీఆర్ ఈ నెల చివరి వారాంతంలో ఆయుత చండీయాగం చేయనున్న నేపథ్యంలో చంద్రబాబును కలవనున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు.. ఆయన కుటుంబం కూడా ఇక్కడే ఉన్నందున కేసీఆర్ చంద్రబాబు ఇంటికి వెళ్లి కుటుంబ సమేతంగా యాగానికి రావాలని ఆహ్వానిస్తారని అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులతో సంప్రదింపులు కూడా జరిపారట. అంతేకాదు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించి.. చాలా జాగ్రత్తగా.. గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ కూడా అదేవిధంగా చంద్రబాబు తనకు ప్రత్యేక స్థానం ఇచ్చినట్లే.. కేసీఆర్ కూడా చంద్రబాబు ప్రత్యేక స్థానం ఇవ్వాలని చూస్తున్నారట. కాగా కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రపతి, గౌవర్నర్ లను చండీయాగానికి ఆహ్వానించిన సంగతి విదితమే.