వై వి సుబ్బారెడ్డి తనయుడు ఎపి హైకోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తు
posted on Dec 6, 2024 2:26PM
వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్య సభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి ఎపి హైకోర్టునాశ్రయించారు. డిసెంబర్ రెండో తేదీన మంగళగిరిలో సిఐడి పోలీసులు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి మీద ఎ1గా కేసు నమోదైంది. ఇదే కేసులో ముందస్తుబెయిల్ కోసం వైవి విక్రాంత్ రెడ్డి ఎపి హైకోర్టునాశ్రయించారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనపై కేసు నమోదైందని విక్రాంత్ రెడ్డి కోర్టుకు విన్నవించుకున్నారు. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.