బియ్యం అక్రమరవాణాపై వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
posted on Dec 7, 2024 9:58AM
ఎపిలో రేషన్ బియ్యం మాఫియా గుట్టు రట్టు చేసిన కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్ ఏర్పాటయ్యింది. రేషన్ మాఫియా, కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై విచారించనుంది. సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డిఎస్పీలు అశోక్ వర్దన్, బాల సుందర్ రావు, గోవిందరావు, రత్తయ్య , సిట్ చీఫ్ తో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం దర్యాప్తు చేయనుంది. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమరవాణాను వ్యవస్థీకృత నేరంగా భావిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హాయంలో ప్రారంభమైన ఈ అక్రమరవాణా గుట్టు విప్పిన కూటమి ప్రభుత్వం 15 ఎఫ్ ఐ ఆర్ ల ఆధారంగా సిట్ దర్యాప్తు చేయనుంది. ప్రతీ పదిహేను రోజులకు ఓ సారి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ఈ బియ్యం ఆఫ్రికాదేశాలకు సప్లయ్ అవుతోంది